Thursday, 5 November 2026

అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.

మల్లాపూర్ సెప్టెంబర్20 (జనం సాక్షి)
మండలంలోని మొగిలిపేట్ ఓబులాపూర్ గ్రామాల మధ్య ఈరోజు ఉదయం మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెట్పల్లి నుండి ఖానాపూర్ వైపు వెళ్తున్న బస్సుకు బోలోర వాహనం అడ్డు రావడంతో ఆ వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి డికొట్టుకొని గుంతలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది లో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్టు స్థానికులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. గాయపడిన ప్రయాణికులను 108 అంబులెన్స్ ద్వారా మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉన్నది.