Thursday, 5 November 2026

బిజెపి కురవి మండల అధ్యక్షునిగా బుడిగ భద్ర సేన గౌడ్ నియామకం

డోర్నకల్/కురవి, సెప్టెంబర్-20, జనం సాక్షిన్యూస్: బిజెపి పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ముదిరాజు రామచంద్రరావు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బిజెపి నూతన అధ్యక్షునిగా తట్టుపల్లి గ్రామానికి చెందిన బుడిగ భద్రసేన గౌడ్ ను ప్రకటిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.బుడిగా భద్రసేన గౌడ్ గతంలో కూడా కురవి మండలానికి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారని ప్రస్తుతం మళ్ళీ బిజెపి మండల అధ్యక్షుడిగా అవకాశం కల్పిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బుడిగ భద్ర సేనగౌడ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను అధ్యక్షునిగా నియమించిన మానుకోట జిల్లా అధ్యక్షులు మద్దిరాజు రామచంద్ర రావు, గిరిజన మోర్ఛ రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ , మాజీ జిల్లా అధ్యక్షులు యాప సీతయ్య, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి రాజవర్ధన్ రెడ్డి, రాచకొండ కొమురయ్య,బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొనతం పెంటయ్య ,జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లభు వెంకటేశ్వర్లు మానుకోట పార్లమెంట్ కో కన్వీనర్ సింగారం సతీష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని అన్ని వర్గాల ప్రజలను, కార్యకర్తలను కలుపుకొని పోలింగ్ బూత్ స్థాయిలో భారత జనతా పార్టీ విస్తరించే విధంగా నా వంతు కృషిని చేస్తానని ఆయన అన్నారు.