Thursday, 5 November 2026

ఓటర్ జాబితాలో అవకతవకలు

టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన

వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్

వనపర్తి బ్యూరో సెప్టెంబర్20 (జనంసాక్షి)

ఓటర్ జాబితాలో అవకతవకలు ఉన్నాయని పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేయలేదని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ అన్నారు. బుధవారం నాడు మాజీమంత్రి జీ. చిన్నారెడ్డి ఆదేశాల మేరకు విలేకరుల సమావేశంలో
వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ
వనపర్తి జిల్లాలో ఓటర్ జాబితాలో అవకతవకలు ఉన్నయని, మరణించిన ఓట్లను బిఎల్ఓ , వీఆర్వో లు ప్రాథమిక విచారణ జరపకుండా జనన మరణాలను పరిశీలించి ఓట్లు తీసేయాలంటే జిల్లాలో ఉండే , ఎలక్షన్ కమిషన్ అని పార్టీల వివరణ తీసుకోకుండా
వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఓటర్ లిస్టు మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని, ఓటర్ లిస్టులను అన్ని పార్టీల జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయాలి అని అన్నారు మరణించిన వారిని ఓటర్ లిస్ట్ కెళ్ళి తొలగించాలి . ఈ ప్రభుత్వం అబద్ధం మాటలు చెబుతూ మొన్న జరిగిన సోనియా గాంధీ బహిరంగ సభలో ఆరు పథకాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది తెలంగాణ ఇస్తానని చెప్పింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకూడదని మనసులో ఉంటే భారతదేశంలో ఉండే 135 పార్టీలను ఏకం చేసి ఒప్పించి మెప్పించి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ వాళ్లు ఒక్కరే కొట్లాడితే తెలంగాణ రాలేదని కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ తెలంగాణ ఇస్తానని చెప్పి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.
టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రజల అభిష్టానం మీదకే కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని సామాన్య ప్రజలు రేషన్ కార్డు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రేషన్ షాపుల్లో రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది తంబు పెడితేనే రేషన్ బియ్యం ఇవ్వబడుతుందని డీలర్లు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు రేషన్ షాపు బియ్యం పై ఎన్నో కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి ప్రజలు కూలి పని చేసుకుని బ్రతకడానికి వేరే ఊరి వెళ్తే వారిపై రేషన్ బియ్యం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు అలాంటి ఆంక్షలు ఏమన్నా ఉంటే వెంటనే వ్యక్తం వేయాలని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షులు నందిమల్ల యాదయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పర్వతాలు వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దివాకర్ యాదవ్ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు జానకి రాములు వనపర్తి మండల అధ్యక్షులు వెంకట్ నారాయణ గోపాల్పేట్ మండల అధ్యక్షులు గణేష్ గౌడ్ పెద్దమందడి మండల అధ్యక్షులు పెంటన్న పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నరసింహ తదితరులు పాల్గొన్నారు