మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ. 2500
– అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం..! – మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బోయిన్ పేటలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు పోలు శివ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఏఐసీసీ సెక్రెటరీ ,ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తుక్కగూడలో నిర్వహించిన విజయభేరి భారి బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రకటించిన అభయ హస్తం పథకాలలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం, కార్యక్రమాల ఆరు గ్యారెంటీ కార్డులనులను ప్రజలకు శ్రీధర్ బాబు వివరించారు. కాంగ్రెస్ హస్తం సామాన్యులకు అభయహస్తం అని, అందుకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కాంగ్రెస్ గారంటీ కార్డు భరోసా అని అన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో గ్యారంటీ కార్డులో చెప్పిన ప్రకారంగా హామీలు అన్ని అమలు చేస్తమని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. మహాలక్ష్మి ప్రతి మహిళకు ప్రతినెలా రూ.2500లు, 500 కి గ్యాస్ సిలిండర్, రైతుభరోసా కింద ప్రతిఏటా రూ. 15000 లు, రూ.12000 లు కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు, వరి పంటకు రూ 500 బోనస్ ఇస్తామన్నారు. గృహాజ్యోతి ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి ఐదులక్షల అందించనున్నామన్నారు. యువవికాసం కింద ప్రతివిద్యార్ధికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషల్ స్కూల్ ఏర్పాటు ద్వారా ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించనున్నామన్నారు. చేయూత పింఛన్ ప్రతినెలా నాలుగు వేలు, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రతను కల్పించనున్నామని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మంథని మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ ముసుకుల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




