అంగన్వాడి కేంద్రంలో టిహెచ్ఆర్ పంపిణి….
చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :-
మండలంలోని బండపోతుగల్ అంగన్వాడీ కేంద్రంలో శివ్వంపేట సూపర్వైజర్ సంతోష అంగన్వాడి కేంద్రం లబ్ధిదారులకు టి.హెచ్.ఆర్ (టేక్ హోమ్ రేషన్) పంపిణీ చేశారు. బుధవారం నర్సాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ హేమ భార్గవి ఆదేశాలతో ప్రాజెక్టు పరిధిలోని సూపర్వైజర్లు, అధికారులు మండలంలోనీ పలు అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు 15 రోజులకు సంబంధించి బియ్యం, పప్పు, కోడిగుడ్లు, పాలు, మంచి నూనె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లు సమ్మె కారణంగా గైరహచర్యైన కేంద్రాల్లో సూపర్వైజర్ల ద్వారా గర్భిణులు బాలింతలు పిల్లలకు పోషకాహారం టి హెచ్ ఆర్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. గర్భిణీలు బాలెంతల్లో పోషకాహార లోపం ఉండరాదన్న ఉద్దేశంతో అధికారుల ఆదేశాల మేరకు సూపర్వైజర్లు మండలంలోని 17 ప్రధాన అంగన్వాడి కేంద్రాల్లో పంపిణీ చేసినట్లు తెలిపారు. అంగన్వాడీ పిల్లలకు టీ సాట్ ద్వారా ఆటపాటలతో విద్యాబోధన జరుగుతుందని తల్లిదండ్రులు గమనించి సహకరించాలని కోరారు. చిట్కుల్ తండాలో చిలక్సెడ్ మండల సూపర్వైజర్ సంతోషిమాత టి హెచ్ ఆర్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వివోఏలు పాల్గొన్నారు.




