Thursday, 5 November 2026

బీఅర్ఎస్ తోనే రాష్ట్రాభివృద్ది
కాంగ్రెస్, బీజేపీలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్21(జనంసాక్షి)

48 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ సాగునీళ్లు, తాగునీళ్లు ఇవ్వకుండా పాలమూరును వల్లకాడు చేసిందని
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు.గురువారం నాడు
వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో రేవల్లి కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు కార్యకర్తలు మంత్రి సమక్షంలో బిఅరెస్ లోచేరారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ
బీఅర్ఎస్ తోనే తెలంగాణ రాష్ట్రాభివృద్ది చెందిదన్నారు.కాంగ్రెస్, బీజేపీలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ,వారి వల్ల
ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలే శరణ్యమయ్యాయని, 10 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని విమర్శించారు.అధికారం కోసమే కాంగ్రెస్ అడ్డగోలు హామీలను ప్రకటిస్తు ప్రజల ను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
9 ఏళ్లలో తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా మారిపోయి,నేడు కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో తెలంగాణ సమగ్రాభివృద్ధి గా దూసుకపోతుందన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ లో చేరిన రేవల్లి కాంగ్రెస్ వార్డు మెంబర్ కాళ్ల బచ్చమ్మ, మండల యువజన ప్రధాన కార్యదర్శి శివ కృష్ణ, మండల సోషల్ మీడియా కన్వీనర్ శివ కాశి, ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షులు సిద్దు, బోర్ల సుబ్బయ్య, బీజేపీ నేత ప్రవీణ్ తదితరులు 55 మంది కి కండువాలు కప్పి పార్టీలోకి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆహ్వానిoచారు , కార్యక్రమంలో తెలంగాణ సేంద్రీయ ఉత్పత్తుల నిర్దారణ కమిటీ సభ్యులు దొడ్ల రాములు, వనపర్తి నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి, జడ్పీటీసీ భీమయ్య, బీఆర్ఎస్ నేత శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.