కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ డోర్నకల్ మండల అధ్యక్షుడిగా భూక్యా కాశీరాం నాయక్ ఎన్నిక
డోర్నకల్, సెప్టెంబర్-21,జనంసాక్షి న్యూస్: కాంగ్రెస్ పార్టీ ఎస్టి సేల్ డోర్నకల్ మండల అధ్యక్షుడిగా హున్యతండా గ్రామానికి చెందిన భూక్యా కాశిరాం నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం టీపీసీసీ ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్, ముఖ్య నేత మాలోత్ నెహ్రు నాయక్ నివాసంలో ఇటీవల జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఆయన చేతుల మీదగా నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భూక్యా కాశీరం నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, టీపీసీసీ ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్ మాలోత్ నెహ్రూ నాయక్, జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి, డోర్నకల్ మండల అధ్యక్షుడు డిఎస్ జగదీష్, ముఖ్య నాయకులు బానోత్ దేవ్‌సింగ్ నాయక్, బానోత్ శంకర్ నాయక్, గూగులోత్ లాలునాయక్, బానోత్ శ్రీను నాయక్,బానోత్ కోబల్ నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికలలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, డోర్నకల్ గడ్డమీద మాలోత్ నెహ్రూ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ఆయన అన్నారు. డోర్నకల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి,పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని డోర్నకల్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్యా కాశీరాం నాయక్ అన్నారు.




