జిల్లాలో పూర్తిస్థాయి ఏర్పాట్లతో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి.
గద్వాల నడిగడ్డ ,సెప్టెంబర్ 21 (జనం సాక్షి);
జిల్లాలో పూర్తిస్థాయి ఏర్పాట్లతో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా అధనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్ అన్నారు.
గురువారం జిల్లా ఐ డి ఓ సి సమావేశం హాలు నందు గద్వాల నియోజకవర్గo 79 తహసిల్దార్లు , సెక్టార్ అధికారులు, సర్వేయర్లు లతో శాసనసభ ఎన్నికలకు జిల్లాలో చేపట్టవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధనపు కలెక్టర్ రెవిన్యూ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో 593 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గద్వాల నియోజకవర్గo లో పూర్తిస్థాయి ఏర్పాట్లతో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సెక్టార్ జోనల్ అధికారులుగా నియమించబడే అధికారులు తమ సెక్టార్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి చేపట్టవలసిన పనులను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని తెలిపారు. గద్వాల నియోజకవర్గo లో 303 పోలింగ్ స్టేషన్ ల కు 32 రూట్ లు ఉన్నట్లు తెలిపారు .సెక్టార్ జోనల్ అధికారులుగా నియమించబడిన అధికారులు తమ సెక్టార్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి నెలకొన్న సమస్యలను గుర్తించి నివేదిక అందించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పనిచేయాలని తెలిపారు.సమావేశంలో తహసిల్దార్లు , సెక్టార్ అధికారులు, సర్వేయర్లు, సంబందిత అధికారులు పాల్గొన్నారు.




