Thursday, 5 November 2026

కామ్రేడ్ పుచ్చకాయల నర్సయ్య 29వ వర్ధంతి,

బదిలీ ఫిల్లర్ లకు దేవుడు,

ఒకప్పుడు 190 మాస్టర్లు నిండని బదిలీ ఫిల్లర్ కార్మికులకు డిపెండెంట్ హక్కు ఉండేది కాదు 1990లో ఎస్సా ర్పీ _1లో బదిలీ ఫిల్లర్ ఆలేటి పోశం గని ప్రమాదంలో చనిపోయాడు ఆయన కుటుంబానికి డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నర్సయ్య సమ్మె చేపట్టి చివరికి హైకోర్టుకు వెళ్లి ఆ హక్కు సాధించాడు, అప్పటినుండి బదిలీ ఫిల్లర్ లకు దేవుడయ్యాడు, ఏడాదిలో 190 మస్టర్లు నిండితేనే పర్మినెంట్ అనే నిబంధనతో సంబంధం లేకుండా ఇంక్రిమెంట్ అమలు చేయించాడు, 1985లో రిక్రూట్ అయిన కార్మికులకు క్వా ర్టర్ వసతి లేకపోవడంతో ఏ స్టేట్ అధికారులను ఎదిరించిక్వార్టర్లు సాధించి పెట్టాడు 1992లో ఆర్కే 7 గనిలో ఓ కార్మికుడు బొగ్గు పెళ్ల తీసుకుపోతుంటే సిఐఎస్ఎఫ్ జవాన్లు అతనిపై దాడి చేయగా కార్మికులతో కలసి ప్రతిదాడికి పూనుకున్నారు ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు,

సర్పంచ్ గా చెరగని ముద్ర

నర్సయ్య 1987లో తాళ్లపల్లి సర్పంచ్ గా పనిచేశారు అప్పుడున్న తాళ్లపల్లి, సింగపూర్, తీగల్పహాడ్ కలిపి తాళ్లపల్లి మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది ఇందులో ఊరు శ్రీరాంపూర్, అరుణ్ అక్క నగర్, సంఘ మల్లయ్య పల్లె, ప్రశాంత్ నగర్ ఏరియాలో సింగరేణి కార్మికులు అధికంగా ఉండేవారు ప్రవేటు స్థలాల్లో నివాసం ఉన్నందున వీరికి కంపెనీ నీళ్లు కరెంట్ ఇచ్చేది కాదు యజమాన్యంతో పోరాడి కంపెనీ నీళ్లు కరెంటు ఇప్పించి రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాడు ఆయన పదవీకాలంలో పరిపాలన సౌలభ్యం కోసం తాళ్లపల్లిని 3 పంచాయతీలుగా ఏర్పాటు చేయించారు

సింగరేణి క్లర్కుగా మొదలైన నర్సయ్య జీవితం,

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మజ్జు గూడెం గ్రామానికి చెందిన పుచ్చకాయల నర్సయ్య కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు బయట ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చిన కార్మిక వర్గం మధ్యనే పని చేయాలని ఉద్దేశంతో 1978లో శ్రీరాంపూర్ లో సింగరేణి క్లర్కుగా చేరారు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నేత వీటి అబ్రహం స్ఫూర్తితో ఏఐటి యు సి లో చేరి చేవనందించారు డివిజన్ కమిటీ సభ్యునిగా ఉపాధ్యక్షుడిగా కార్యదర్శిగా సెంట్రల్ కౌన్సిల్లో కూడా పనిచేశారు,

సింగరేణి లో ప్రతి బొగ్గు పెళ్లకు ఓ రక్తపు చరిత్ర ఉంది ప్రతి చరిత్రలో కార్మికుల కోసం పోరాడిన ఓ త్యాగమూర్తి ప్రస్థానం ఉంటుంది అలాంటి ఎందరో ఉద్యమకారులకు నేలపైన సింగరేణిలో కామ్రేడ్ పుచ్చకాయల నర్సయ్య ప్రత్యేక వ్యక్తి శక్తి శతాబ్దం న్నర కాలం పాటు కార్మికులకు సేవలందించిన ఆయన 1994 సెప్టెంబర్ 21న సికాస చేతిలో హత్యకు గురయ్యాడు శ్రీరాంపూర్ లో ఉద్యోగ ప్రాస్థానంలో మొదలైన నర్సయ్య జీవితం ప్రజా ప్రతినిధిగా సైతం కొనసాగింది కార్మికులకు ప్రజలకు ఎనలేని సేవలందించాడు ఆయన స్మారకార్థం సి సి సి కార్నర్ వద్ద భవనాన్ని నిర్మించారు,

సికాస కాల్పులు,

హక్కుల సమస్యలపై పోరాటాలు చేసిన నర్సయ్య ను కార్మికులు అమితంగా ఆదరించారు ఇది ఏఐటి యు సి కి మరింత బలపడడానికి దోహద పడింది ఆ రోజుల్లో సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కు కూడా కార్మికుల్లో గట్టి పట్టు ఉండేది సమైక్య నేతల మాటే వేదం రాజకీయ అధిపత్యంలో నర్సయ్య సికాస కు టార్గెట్ గా మారాడు ఈ క్రమంలో 1994 సెప్టెంబర్ 21న ఆఫీసు నుంచి శ్రీరాంపూర్ కాలనీలోని ఇంటికి వస్తుండగా నర్సయ్య ను క్వార్టర్ ముందే సికాస మిలిటెంట్లు తుపాకితో కాల్చి చంపారు, ఇది ఏఐటియుసికి కోలుకోని దెబ్బ అయ్యింది, ఆయన మరణించిన ఏడాదిలోపే శ్రీరాంపూర్ అంగడి వద్ద స్మారక స్తూపం నిర్మించారు ప్రస్తుతం సిసిసి కార్నల్ వద్ద స్మారక భవన్ (నర్సయ్య భవన్) నిర్మించారు, భార్య పిల్లలు వరంగల్ లో స్థిరపడ్డారు,

కామ్రేడ్ పుచ్చకాయల నర్సయ్య గారికి విప్లవ జోహార్ల జోహార్లు…
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC)
మందమర్రి బ్రాంచ్.
భారత కమ్యునిస్టు పార్టీ (CPI) మందమర్రి పట్టణ కమిటీ..✊✊🚩✊