వాజిద్ కుటుంబ సభ్యుల ను పరామర్శించిన
వంగూర్ ప్రమోద్ కుమార్ రెడ్డి
వనపర్తి బ్యూరో సెప్టెంబర్21 (జనంసాక్షి)
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిఏ ఆసిఫ్ బామ్మర్ది వాజిద్ అకస్మాత్తుగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వనపర్తి నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారితోపాటు ప్రశాంత్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు




