Thursday, 5 November 2026

క్రీడలు శారీరక దృఢత్వానికి తోడ్పడతాయి

గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

వనపర్తి బ్యూరో సెప్టెంబర్21 (జనం సాక్షి )

క్రీడలు శారీరక దృఢత్వానికి తోడ్పడతాయని,
గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని విద్యార్థుల నుద్దేశించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.గురువారం నాడు
వనపర్తి మండలం చిట్యాల సమీపంలోని గురుకుల పాఠశాలలో ఉమ్మడి జిల్లాస్థాయి బీసీ గురుకుల పాఠశాలల క్రీడలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆడబిడ్డలు అందరితో సమానమని పురుషులతో పాటు వారిని సమానంగా గౌరవించాలని ,ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు అందరూ చదువుకుంటున్నారని తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని సంక్షేమ గురుకుల పాఠశాలలలో సమస్యల పరిష్కారం అవుతావని, అన్ని గురుకుల పాఠశాలల సొంత భవనాల నిర్మాణానికి కృషిచేస్తానని,
విద్యార్థుల విద్యా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
గ్రామాలలో కరంటు, సాగునీరు లభ్యతపై ఆరా
తీశారు.ఈ కార్యక్రమంలో
జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, సర్పంచ్ భానుప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.