కొండ లక్ష్మణ్ బాపూజీకి నివాళులు జనంసాక్షి, మంథని :
పెద్దపల్లి జిల్లా మంథని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంథని మండల కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ సమాజానికి బాపూజీ చేసిన సేవలు మరువలేనివన్నారు. తొలి, మలి దశ తెలంగాణ పోరాటంలో ఆయన పాల్గొన్నారని గుర్తు చేశారు. తన జీవిత కాలమంతా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన గొప్ప నాయకుడు బాపూజీ అన్నారు. దేశంలో బాపూజీ అని గౌరవం దక్కిన రెండో వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షులు ఆయిల్ ప్రసాద్, మంథని మున్సిపల్ , మండల్ ప్రచార కమిటీ చైర్మన్ వొడ్నల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బుడిద శంకర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అజీమ్ ఖాన్, సింగల్ విండో డైరెక్టర్ రవికంటి సతీష్ జిల్లా అధికార ప్రతినిధి ఇనుముల సతీష్, కిసాన్ సెల్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి , ఐ ఎన్ టి సి జాతీయ నాయకులు పెరవేన లింగయ్య యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజు, ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాచిడి రవితేజ, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జమీల్ హైమద్, మైనార్టీ సెల్ మంథని మండల అధ్యక్షులు అలిమ్ ఖాన్,మంథని టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, పెంటారి రాజు. మాజీ సర్పంచలు రామ్ రాజశేఖర్, దోరగొర్ల శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, ఎస్సీ సెల్ మంథని డివిజన్ ఉపాధ్యక్షులు మంథని సమ్మయ్య, మాజీ సర్పంచులు నాగుల రాజయ్య, కుడుదుల మాధవ్,ఎరుకల మధు, తదితరులు పాల్గొన్నారు




