బిచ్కుందలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
పాల్గొన్న ఎమ్మెల్యే హన్మంత్ షిండే
బిచ్కుంద (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల మార్కండేయ మందిరంలో గురువారం నాడు స్వతంత్ర సమరయోధుడు నిబద్దత కలిగిన రాజకీయవేత్త బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుడు మరియు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను తెలియజేశారు. బిచ్కుంద మండలంలోని మార్కండేయ మందిరంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ అశోక్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, డాక్టర్ రాజు, పద్మశాలి సంఘo అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, గుడుబర్ల నారాయణ, సుంకి లక్ష్మణ్, అల్లి సాయిలు, కోశాధికారి బాల్ కిషన్, రచ్చ శివకాంత్ మరియు పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు నివాళులు అర్పించారు.




