గణనాధులను దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పోచమ్మ వాడలో వినాయక మండపాలను మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం దర్శించుకున్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో క్షేమంగ ఉండాలి అని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీధర్ బాబు వెంట కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.




