సంగారెడ్డి లో పేరుకుపోయిన చెత్త సమస్యను డంపు యాడ్ సమస్యను వెంటనే పరిష్కరించాలి

నిరుపేదలకు ఇచ్చిన ఇండ్ల పట్టాలకు పొజిషన్ వెంటనే చూపించాలి
బిఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు
బిజెపి సంగారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ రాజేశ్వర దేశ్పాండే
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి సెప్టెంబర్ 21
సంగారెడ్డి లో పేరుకుపోయిన చెత్త సమస్యను డంపు యాడ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని అలాగే
నిరుపేదలకు ఇచ్చిన ఇండ్ల పట్టాలకు పొజిషన్ వెంటనే చూపించాలని బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బిజెపి సంగారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ రాజేశ్వర దేశ్పాండే అన్నారు.
గురువారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని నటరాజ్ థియేటర్ వద్ద 24 గంటల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను
వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తూ 24 గంటల ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ రాజేశ్వర దేవ్స్ పాండే ముఖ్యఅతిథిగా పాల్గొని దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే గాని చేతల ప్రభుత్వం కాదన్నారు. సంగారెడ్డి పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడం శోచనీయమన్నారు సంగారెడ్డి పట్టణంలో ఎటు చూసినా మురికి కాలువలు నిండిపోయి రోడ్లపై పారుతున్నాయి అన్నారు డంప్యాడ్ సమస్యను ఇప్పటివరకు పరిష్కరించకపోవడం దారుణం అన్నారు వెంటనే డంప్యాడ్ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలపై బిజెపి పార్టీ ఎప్పటికప్పుడు నిలదీస్తుందని అన్నారు స్థానిక ఎమ్మెల్యే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా సంగారెడ్డిని పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ పోచారం రాములు, సంగారెడ్డి బిజెపి కౌన్సిలర్లు మందుల నాగరాజు, కసిని వాసు దోమల విజయ్ కుమార్ పవన్ శ్రీనివాస్ రెడ్డి శ్రీకాంత్ మాణిక్ రావు గురునాథరాజు వెంకట నరసింహారెడ్డి ఎల్లన్న ప్రశాంత్ ప్రభాకర్ పాపయ్య శ్రీనివాస్ ఆంజనేయులు బిజెపి అసెంబ్లీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




