కొండ లక్ష్మణ బాపూజీకి ఘన నివాళులు జనంసాక్షి, రామగిరి :
స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతి సందర్భంగా సెంటనరికాలనీ తెలంగాణ సెంటరులో ఫోటోకు దండవేసి, పూలతో ఘనంగా నివాళి అర్పించారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సాధన కోసం తొలిదశ, మలిదశ ఉద్యమంలో వారి పోరాటం, తన పదవిని తృణపాయంగా త్యాగం చేసి చివరి దశలో ఇల్లును తెలంగాణ ఉద్యమ కార్యాలయానికి ఇచ్చి, అందరికి స్ఫూర్తినిచ్చిన మహానుబావుడు తెలంగాణ జాతిపితగా పిలుస్తూన్నామని, అలాగే తన పద్మశాలికోసం హైద్రాబాద్ నారాయణగూడలో పద్మశాలి భవనానికి పునాదివేసి, నిర్మాణం చేయించిన పద్మశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని పలువురు కొనియాడారు. ఈ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్ష-కార్యదర్శులు తుమ్మ మధుసూధన్, కొలిపాక సారయ్య, సహాయ కార్యదర్శి వేముల సతీష్ కుమార్, రామగిరి బిసి సెల్ కాంగ్రేస్ అధ్యక్షులు, పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు బండారి సదానందం, రామగిరి మండల పద్మశాలి అధ్యక్షులు కుంట శ్యాంకుమార్, మంథని బియస్పి నాయకులు జనగామ రవిందర్, భాజాపా నాయకులు కుంట చక్రవర్తి, మాజీ ఉపసర్పంచ్ ముచ్చకుర్తి శ్రీనివాస్, పద్మశాలి నాయకులు తాటికొండ రాజమల్లు, వేముల మల్లయ్య, దూడం కుమారస్వామి, బొద్దుల వెంకటరమణ, ఒడ్నాల రాధాకిషన్, కట్ల శ్రీధర్, పర్శ రాజమల్లు, వెంకటేశ్, కొలిపాక తిరుపతి, కట్ల భరత్, బూవ్ల సతీష్, కొలిపాక కుమారస్వామి, కొట్టె నాగరాజు, మోకనపెల్లి సమ్మయ్య, కొట్టె నాగరాజు, తదీతరులు పాల్గొన్నారు.




