అందరికీ జై భీమ్
జై కాన్సిరాం
జై భారత రాజ్యాంగం
ఈరోజు( 21-09-2023) నాడు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ డా” విశారధన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించిన మహిళ రిజర్వేషన్ బిల్లు పై 33% మహిళలు రిజర్వేషన్లు 90% బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉపకోట కేటాయించాలని డిమాండ్ తో ధర్మ సమాజ్ పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మ సమాజ్ పార్టీ DSP నాయకులు అరవింద్ మహారాజ్ మాట్లాడుతూ BC,SC,ST మహిళలకు 90% ఉప కోట కేటాయించక పోవడం, దానికి 454 మంది MP లు మద్దతు ఇవ్వడం దారుణమని, దీన్ని బట్టి మనం ఇలాంటి నాయకులను ఎన్నుకున్నందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ మహారాజ్, రాజు, సత్యం, సంతోష్, నితిన్, శేఖర్, వినయ్, రాజశేఖర్, నరేష్, శివ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




