గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ విప్ రేగా
– మండలంలో విస్తృత పర్యటన
ఆళ్లపల్లి సెప్టెంబర్ 21 (జనం సాక్షి)
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు .గురువారం ఆళ్లపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు .ఈ సందర్భంగా లక్ష్మిపురం గ్రామంలో సుమారు 32 లక్షల రూపాయలతో మన ఊరు మనబడి కార్యక్రమంలో ప్రారంభోత్సవం నిర్వహించారు. కిచ్చెనపల్లి నుండి రాఘవాపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం సుమారు 2 కోట్ల 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, అనంతోగు నుండి ఏజీ హెచ్ఎఎస్ వరకు సుమారు 45 లక్షల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు .తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా అవుతుందని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాయని అన్నారు. గ్రామాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజు భార్గవి, జెడ్పిటిసి కొమరం హనుమంతరావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు కొమరం వెంకన్న, కోపరేటివ్ చైర్మన్ గోగ్గేల రామయ్య, కోపరేటివ్ డైరెక్టర్ హఫీజ్, మండల ప్రచార కార్యదర్శి నరేడ్ల ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు కొమరం వెంకటేశ్వర్లు, యూత్ విభాగ మండల అధ్యక్షులు కొమరం సతీష్ తదితరులు పాల్గొన్నారు.




