Thursday, 5 November 2026

ఆర్ యం పీ వైద్యం వికటించి మహిళ మృతి

దేవరుప్పుల, సెప్టెంబర్ 21(జనం సాక్షి): దేవరుప్పుల మండలంలోని పడమటి తండా లో విషాదం నెలకొంది. అర్ యం పీ డాక్టర్ వైద్యం వికటించి లక్ష్మి అనే మహిళ మృతి చెందింది.వివరాల్లోకి వెళితే మృతురాలు పేరు జాటోతు లక్ష్మి( భర్త నరేష్ ) కొద్ది రోజులుగా కాళ్ళు ,చేతులు నొప్పిగా ఉందని కొడకండ్ల మండలాన్ని రామన్నగూడెం గ్రామంలో ఉన్న ఆర్ యం పి డాక్టర్ భారత్ సోమన్న దగ్గరికి వచ్చిన లక్ష్మి కాళ్ళు,చేతులు నొప్పి పేడుతున్నాయని చెప్పడంతో డాక్టర్ సోమన్న ఇంజక్షన్ వేసిన కాసేపటికే అస్వస్థకు అయ్యి పరిస్థితి సీరియస్ గా అవ్వడంతో వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సోమన్న అనడంతో అంబులెన్స్ కి ఫోన్ చేసిన భర్త నరేష్ వెంటనే అంబులెన్స్ పై జనగామ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో లక్ష్మి మృతి చెందిందని కుటుంబసభ్యులు,బంధువులు అంటున్నారు.మార్గమధ్యలో మృతి చెందిన లక్ష్మి మృతదేహాన్ని దేవరుప్పుల పోలిస్ స్టేషన్ ముందు పెట్టీ కుటుంబ సభ్యులు,బంధువులు,గ్రామస్థులు సూర్యాపేట – జనగామ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో బస్సులు,లారీలు ,మిగతా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.దాదాపు గంటన్నర సేపు మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చెయ్యడంతో వాహనాలు నిలిచిపోవడంతో రంగంలో దిగిన పోలీసులు కుటుంబ సభ్యులను నచ్చ జెప్పి ట్రాఫిక్ నీ క్లియర్ చేశారు.లక్ష్మి కుటుంబ సభ్యులు ఆర్ యం పి డాక్టర్ సోమన్న పై పిర్యాదు చెయ్యడంతో పిర్యాదు తీసుకున్న పోలీసులు సోమన్న పై కేసు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు.మృతురాలి కి ఒక కొడుకు చరణ్(8 సం),ఒక కూతురు సింధూ(10 సం) అస్థి పాస్తులు ఏమీ లేదని కూలి పని చేసి బతుకు తున్నమని మాకు తగిన న్యాయం చెయ్యాలని కుటుంబ సభ్యులు అంటున్నారు