కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ లో ఉంటా….
40 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు.
ఆర్యవైశ్య ముద్దుబిడ్డగా ఆశీర్వదించండి.
టిపిసిసిరాష్ట్ర మహిళ ఆధికార ప్రతినిధి కల్వసుజాత.
తాండూరు సెప్టెంబర్ 21(జనంసాక్షి) కాంగ్రెస్ పార్టీ తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటానని టిపిసిసి రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కల్వసజాత పేర్కొన్నారు. తాండూరు పట్టణం దుర్గాగార్డేన్స్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసిరాష్ట్ర మహిళ ఆధికార ప్రతినిధి కల్వసుజాత మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని విజయభేరి సభ అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లను గెలుస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని గత 20 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ తన గళం వినిపించానని అన్నారు. తాండూర్ బిడ్డగా నాకు ఈ సారి అవకాశం ఇవ్వాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి అభివృద్ధి కోసం బి ఆర్ ఎస్ లో చేరానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెప్పారని, మరి ఏ మేరకు తాండూర్ అభివృద్ధి చెందిందో చూపెట్టాలన్నారు.రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నమ్మక ద్రోహం చేశారని, అలాంటి వ్యక్తిని ఈ సారి తాండూర్ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.ఆర్యవైశ్య బిడ్డగా, ఒక మహిళ గా నాకు ఈసారి ఎమ్మెల్యే గా అవకాశం ఇవ్వాలన్నారు.టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నానని, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు, అధిష్టానం నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.అనంతరం శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ స్థానికంగా ఉండే వ్యక్తికి, పార్టీ ఫిరాయించని వ్యక్తికే టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు.టికెట్ ఎవరికి వచ్చినా నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గెలుపు కోసం కృషి చేస్తారన్నారు.ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్త శ్రీరాంమ్ రెడ్డి,
వ్యపారవేత్తలు కల్వరవికుమార్. కల్వరాజేశ్వర్ ,కల్వసుధాకర్ ,కల్వ ఉదయ్ కుమార్ ,యాలాల మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు బిమయ్య.తదితరులు ఉన్నారు.




