ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని ప్రతి ఒక్కరు ఓటు హక్కును నిస్వార్ధంగా వినియోగించుకోవాలి – అదనపు కలెక్టర్ కుమార్ దీపక్
ప్రపంచ గతిని మార్చగల శక్తి ఒక్క ‘ఓటు’కే ఉన్నది. అలాంటి ఆయుధాన్ని వృథా చేసుకోవడం, లేదా ప్రలోభాలకు గురై అమ్ముకోవడం వంటివి చేయడం రాజ్యాంగ విరుద్ధం అని నాగర్ కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
గురువారం భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటు వినియోగం విశిష్టతపై 18 సంవత్సరాలు నిండిన నూతన ఓటర్లు నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట పట్టణాల్లోని డిగ్రీ, ఇంటర్మీడియట్ కళాశాలల విద్యార్థులతో జిల్లాస్థాయి నాటక సంస్కృతిక పోటీలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ……
దేశ గతిని మార్చగల శక్తి ఒక్క ‘ఓటు’కే ఉన్నదని, అలాంటి ఆయుధాన్ని వృథా చేసుకోవడం, లేదా ప్రలోభాలకు గురై అమ్ముకోవడం వంటివి చేయడం రాజ్యాంగ విరుద్ధం, ఒక వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి, వ్యవస్థ మార్పునకు ఓటు నాంది పలుకుతుందన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ వంతు కర్తవ్యంతో ఉన్నత నాయకులను ఎన్నుకొనే విధానమే ఎన్నిక అని చెప్పారు. ప్రతి పౌరుడు తమ ఓటును వినియోగం చేసుకొని సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుందని చెప్పారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆయన కన్న కలలు నెరవేరుతాయన్నారు. పురుషులతో పాటు మహిళలకూ సమాన ఓటు హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు.
18 ఏండ్లు నిండిన యువతీ, యువకులంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్నారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పక ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకు గాను ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించు కోవాలన్నారు. అక్టోబర్ ఒకటి 2023 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు.
మీ ఇంటిలో ఎవరైనా అన్నాతమ్ముళ్ళు , అక్కా చెల్లెలు ఎవరు ఉన్నా వారికి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్ జాబితాలో నమోదు చేయించాలని అన్నారు.
ముందుగానే ఓటు హక్కు ఉన్నవారు ఓటర్ జాబితా లో ఓటు ఉందా లేదా అని ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలన్నారు.
మంచి నాయకున్ని ఎన్నుకుంటే మంచి సమాజం ఏర్పడుతుందన్నారు.
ఓటు విశిష్టతపై విద్యార్థులు నిర్వహించిన నాటక ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.
నాటక ప్రదర్శనలో కొల్లాపూర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ప్రదర్శించిన నాటికకు మొదటి బహుమతి లభించింది.
రెండో బహుమతి నాగర్ కర్నూల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు గెలుపొందారు.
మూడో బహుమతి నాగర్ కర్నూల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు గెలుపొందారు.
ఈనెల 26వ తేదీన హైదరాబాదులో రాష్ట్రస్థాయి నిర్వహించే పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు పాల్గొననున్నారు.
పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ పత్రాలను అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ అందజేశారు.
గెలుపొందిన విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రధానం చేశారు.
పోటీల న్యాయ నిర్ణీతలుగా జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు గుడిపల్లి నిరంజన్, కృష్ణమోహన్ లు వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి రామ్మోహన్రావు, డీఈఓ గోవిందరాజులు, ఆయా కళాశాలల ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థులు యువ ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.
………………………………
జిల్లా పౌర సంబంధాల అధికారి నాగర్ కర్నూల్ ద్వారా జారీ.




