రాగల 24 గంటల్లో పలు చోట్ల వానలు కురిసే అవకాశం

హైదరాబాద్‌ : రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలో తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కదులుతున్న అల్పపీడన ద్రోణి బలపడింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించారు.

తాజావార్తలు