Tuesday, 3 November 2026

రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం

హైదరాబాద్‌ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాగల రెండ్రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించనున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు సహా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి వెనుదిరిగాయి. మరో 34 గంటల్లో దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించనున్నాయి. ఈనెల 22వ తేది నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కోస్తా, జిల్లాల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *