హైదరాబాద్,(జనంసాక్షి): ఈ ఏడాది 2500 మెడికల్ సీట్లు అదనంగా వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి తెలిపారు. నెల్లూరు, కరీంనగర్‌లలో వచ్చే సంవత్సరం మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఐఐటీ, జేఈఈ ప్రవేశాల్లో రాష్ట్రానికి న్యాయం జరుగుతందని మంత్రి తెలిపారు.




