Tuesday, 3 November 2026

విధులకు హాజరు కాని ఉపాధ్యాయులపై వేటు

నెల్లూరు,(జనంసాక్షి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన 11 మంది ఉపాధ్యాయులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీఈవో ఎం. రామలింగం ఆదేశాలు జారీచేశారు. ఈ రోజు డీఈవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వీరంతా అధికారలకు చెప్పకుండా బయట వ్యాపారాలు నిర్వహిస్తూ విధులకు హాజరుకావడం లేదని తెలిపారు. అదేవిధంగా పదో తరగతి ఫలితాల్లో తక్కువ శాతం వచ్చిన ఏడు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రేపు నగరంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో ప్రోత్సాహకాలు అందించనున్నట్లు డీఈవో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *