26న కేజీబీవీ సిబ్బంది సమస్యల పరిష్కారానికై నిరసన ధర్నా
— టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్
టేకులపల్లి, నవంబర్ 24( జనం సాక్షి ): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కేజీబీవీ ఉపాధ్యాయునిల, సిబ్బంది సమస్యల పరిష్కారానికై ఈనెల 26న మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు జరిగే రెండవదశ నిరసన ధర్నాలో ఉపాధ్యాయునిలు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ కోరారు. ఈ సందర్భంగా విలేకరులతో వారు మాట్లాడుతూ కేజీబీవీ ఉపాధ్యాయినీలను,సిబ్బందిని రెగ్యులర్ చేయాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని,సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉపాధ్యాయినీలకు 27 రోజుల సాధారణ సెలవులు మంజూరు చేయాలని,మేటర్నిటీ,హిస్టరీ సెలవులు ఇవ్వాలని, ఉపాధ్యాయినీలను రాత్రి విధులనుండి తొలగించి వారి స్థానంలో మ్యాట్రిన్లను నియమించాలని,హెల్త్ కార్డులు ఇవ్వాలని,కళాశాలలో అదనపు సిబ్బందిని నియమించాలని,రాత్రి కాపలాకు వాచ్మెన్లను నియమించాలని,రిపేర్లకు ప్రత్యేక నిధులు కేటాయించాలని,బదిలీలు నిర్వహించాలని,ఎస్ఓలను మోడల్ స్కూల్ హాస్టల్ నిర్వహణ బాధ్యతల నుండి తొలగించాలని,కేజీబీవీలలో నీటి, విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు.
26న కేజీబీవీ సిబ్బంది సమస్యల పరిష్కారానికై నిరసన ధర్నా




