వాల్మీకుల దీక్షకు మద్దతు తెలిపిన వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వనపర్తి టౌన్: నవంబర్ 24 ( జనం సాక్షి) ఈరోజు 15వ రోజు జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి వాల్మీకుల రిలే నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించిన వనపర్తి మున్సిపలిటీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్… వైస్ చైర్మన్ మాట్లాడుతూ, మీరు చేసేటటువంటి దీక్ష న్యాయపరమైనది,మీకు పూర్తి మద్దతు నావంతుగా, ఉంటదని,చెప్పడం జరిగింది. అలాగే మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దృష్టిలో ఉంది గనుక,మరొకసారి మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. వాల్మీకులను ఎస్టీలో చేర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి ఎంతో ఉందని, ఈ సందర్భంగా అన్నారు.అందులో భాగంగా “చెల్లప్ప కమిషన్”ఏర్పాటు చేసి నివేదికను కేంద్రానికి పంపిన ఘనత కూడా”కేసిఆర్ దే”అని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కుంటి సాకులతో, దాన్ని వెనక్కి తిప్పి పంపిందన్నారు. మరొక్కసారి రాష్ట్ర క్యాబినెట్ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంనికి నివేదిక, పంపడానికి సిద్ధంగా, ఉందని, ఈ సందర్భంగా తెలియజేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి అనేకసార్లు వాల్మీకుల సమస్యల పైన ముఖ్యమంత్రి తో చర్చించడం జరిగింది. వాల్మీకుల రాష్ట్ర సంఘం నాయకులను ముఖ్యమంత్రికి తో కల్పించడం జరిగిందని,ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు, వేణుగోపాల్ నాయుడు, టీకే.కురుమన్న, నీల స్వామి, రాష్ట్ర మార్కెట్ యార్డ్ డైరెక్టర్ విజయకుమార్, తాటిపాల వెంకటయ్య, పెద్దముక్కల రవి,నరేష్ కుమార్, తుమ్మల రాములు నాయుడు, శ్రీరంగాపురం మండల అధ్యక్షులు సంపత్ కుమార్, వెంకటేష్ నాయుడు, ధర్మరాజు,నరేష్ నాయుడు, నాగవరం వాల్మీకి సంఘ నాయకులు,అధ్యక్షులు,చిన్న రాములు,రామస్వామి,వెంకటయ్య,కేశవులు, మన్యం, తదితరులు నాయకులు పాల్గొన్నారు.
వాల్మీకుల దీక్షకు మద్దతు తెలిపిన వనపర్తి మున్సిపల్




