Thursday, 5 November 2026

26న చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

26న చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
అఖిలభారత రైతు కూలి సంఘం ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పి.నాగయ్య…
ఖమ్మం.తిరుమలయపాలెం. (నవంబర్ 24) జనం సాక్షి. మండల కేంద్రంలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన జనరల్ బాడీలో అఖిలభారత రైతుకూలీ సంఘం *జిల్లా సహాయ కార్యదర్శి పోలేపొంగు నాగయ్య మాట్లాడుతూ
ఎస్ కే యం ఇచ్చిన పిలుపులో భాగంగా ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బిజెపి మోడీ ప్రభుత్వం రైతులకు లిఖితపూర్వంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని దేశంలో వ్యవసాయ రంగం పై ఆధారపడి జీవిస్తున్న 40 కోట్ల మంది ప్రజలను నిర్వాసితులను చేసి భూములను అడవిని అడవి సంపదను, ఖనిజ సంపదను ప్రైవేట్ కంపెనీలకు ఆదాని అంబానీలకు బహుళ జాతి సంస్థలకు అమ్మి వేసి 2022 అటవీ సంరక్షణ నియమావళి ముషయిదాను పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టాన్ని తీసుకువచ్చే విధానాన్ని రద్దు చేయాలని ఎం ఎస్ పి వ్యవసాయ పంటలకు మద్దతు ధర చట్టం అమలు చేయాలని పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సర్వే చేసిన భూములకు వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో అమరులైన ప్రతి కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పంటల బీమా సన్న చిన్న కారు రైతులందరికీ 5000 పింఛను సౌకర్యం కల్పించాలని ,
26న జరిగే రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో రైతులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు అచ్చా ఉప్పలయ్య, నరసయ్య, రామనబోయిన శ్రీను, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.