బాగ్దాద్: ఆల్ ఖైదా, ఐఎస్ సంస్థల అరాచకంతో ఇరాక్ అట్టుడికిపోతుంది. ఉగ్రవాద సంస్థలు సాగిస్తున్న నరమేధంతో ఎంతో మంది వీగత జీవులుగా మారుతున్నారు. తాజాగా ఉత్తర ఇరాక్ సాదీయ జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 26 మృతదేహలను సైనికులు మంగళవారం గుర్తించారు. మృతుల్లో 15 మంది పౌరులు కాగా, మరో 11 మంది కుర్దిష్ భద్రత దళంలోని సభ్యులుగా గుర్తించినట్లు ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ఈ ఘాతుకం ఐఎస్ పనే అని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.
26 మందిని ఆపహరించి సామూహికంగా హత్య చేసి ఉంటారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దేశంలో గల్లంతవుతున్న వారి కోసం సైనిక దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో 26 మృతదేహలను గుర్తించారు. గతేడాది జూన్ 10 నుంచి ఇరాక్లోని భద్రత సిబ్బందికి ఐఎస్ సంస్థకు చెందిన ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న పోరులో ఎంతో మంది మరణిస్తున్న సంగతి తెలిసిందే.




