Sunday, 8 November 2026

27న జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలు..

27న జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలు..
ఊరుకొండ, నవంబర్ 24 (జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల పరిధిలోని ఉరుకొండపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 27న జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కబడ్డీ అసోసియేషన్ ఛైర్మెన్ ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి. అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్. ప్రధానకార్యదర్శి యాదయ్య గౌడ్ లు గురువారం ప్రకటనలో తెలిపారు. జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలకు వచ్చే క్రీడాకారులు జనవరి 2007 తర్వాత జన్మించి ఉండాలని, బరువు 55 కేజీల లోపు ఉండాలని సూచించారు. క్రీడాకారులు పదవ తరగతి మెమో లేదా బోనఫైడ్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు తీసుకుని రావాలని కోరారు. ఈ సెలక్షన్ లో ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ నెలలో మంచిర్యాల జిల్లాలో జరుగనున్న 32వ సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్ షిప్ లో పాల్గొంటారని తెలిపారు. ఎంపీకలకు వచ్చే క్రీడాకారులు ఈ క్రింది ఫోన్ నెంబర్లు 8978358922, 9440421467, 9494492914 లను సంప్రదించాలని జిల్లా ప్రధానకార్యదర్శి, పీఈటీ యాదయ్యగౌడ్ తెలిపారు