ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో రైతులు ఎవరు ఆందోళన చెందవద్దుధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు
చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్దసాని
జనం సాక్షి,చెన్నారావుపేట
ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చెన్నారావుపేట, పాపయ్యపేట, ఖానాపురం మండలంలోని రాగంపేట, నెక్కొండ మండలంలోని గొల్లపల్లి గ్రామాలలో చెన్నారావుపేట సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. మిగతా గ్రామాలైన ఉప్పరపల్లి, ఎల్లయ్య గూడెం గ్రామాలకు మిల్లుల అనుమతి రానందున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదన్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మిల్లర్ల అనుమతి రాగానే రెండు మూడు రోజుల్లో ఉప్పరపల్లి, ఎల్లయ్యగూడెం గ్రామాలలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. రైతులు గమనించాలని ఆయన కోరారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో రైతులు ఎవరు




