హైదరాబాద్,(జనంసాక్షి): బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో సెప్టెంబర్ 28న ప్రజాగర్జన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశానికి బీజేపీ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ హాజరుకానున్నఉట్ల ఆయన స్పష్టం చేశారు. అయితే రాయల తెలంగాణపై తమ పార్టీలో చర్చ జరగలేదని ఆయన పేర్కొన్నారు.




