Tuesday, 3 November 2026

29న సూర్యాపేటకు ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): ఇస్కాన్ కూకట్‌పల్లి, హైద్రాబాద్ వారి ఆధ్వర్యంలో గత వారం రోజుల క్రితం అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ జగన్నాథ రథయాత్ర రాష్ట్రంలో అనేక పట్టణాల్లో పర్యటిస్తూ ఈనెల 29న తొలి ఏకాదశి రోజున సూర్యాపేట జిల్లా కేంద్రానికి రానున్నట్లు దేవాలయాలు ధార్మిక సంస్థల ఐక్యవేదిక ప్రతినిధులు తెలిపారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీ భగవద్గీత మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విదేశీ భక్తులు సైతం పాల్గొంటున్న తొమ్మిది రోజుల శ్రీ జగన్నాథ రథయాత్ర చివరి రోజు కార్యక్రమం సూర్యాపేటలో నిర్వహిస్తున్నందున భక్తులందరూ వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు మీలా మహాదేవ్, సభ్యులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, నల్లాన్ చక్రవర్తుల మురళీధరాచార్యులు, తోట శ్యాం ప్రసాద్, పర్వతం శ్రీధర్ కుమార్, నాగవెల్లి ప్రభాకర్, మహేశ్వరం రవిచంద్ర , పసునూరి దినేష్ బాబు, మొరిశెట్టి రామ్మూర్తి, సతీష్ శర్మ, ఈగ దయాకర్ గుప్తా, చలమల్ల నరసింహ, సలిగంటి వీరేంద్ర, తండు దేవిక, తండు వాసవి, ఈగ వెంకటేశ్వర్లు, బైరు విజయ కృష్ణ , గట్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.