29 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా
బిచ్కుంద అక్టోబర్(జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాబ్ మేళాను నవంబర్ 4 శుక్రవారం రోజున నిర్వహిస్తున్నామని అదేవిధంగా హైదరాబాదులో పలు బహుళ జాతి సంస్థలలో ప్రీమియర్ లీగ్ మరియు ఆవిష్కరణ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలలో పనిచేయుటకై పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రముఖర్జి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి.శ్రీనివాస్ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




