Tuesday, 3 November 2026

బీపీ, షుగర్ మాత్రల పంపిణీ.

బీపీ, షుగర్ మాత్రల పంపిణీ.
పోటో: మాత్రలు అందజేస్తున్న ఎంపీపీ.
నెన్నెల, అక్టోబర్29, (జనంసాక్షి)
నెన్నెల మండలం ఆవడం గ్రామంలో శనివారం ఎంపీపీ సంతోషం రమాదేవి ఆధ్వర్యంలో వృద్ధులకు బీపీ, షుగర్ మాత్రలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి ఎంతగానో శ్రద్ధ తీసుకుంటుందని దీనికి నిదర్శనంగా ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ మాత్రల పంపిణీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా ప్రజలను ఆదుకుంటు ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో నెన్నెల ఆరోగ్య కేంద్రం వైద్యుడు జుబేర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.