Thursday, 5 November 2026

3 వేల ఎకరాలకు నిరంధించండి

3 వేల ఎకరాలకు నిరంధించండి
వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్
జనం సాక్షి కథలాపూర్
కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పూర్తయితే కథలాపూర్ మేడిపల్లి మండలాలకు 43 వేల ఎకరాల కు నీరు సాగవుతుందని కాంగ్రెస్ వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రతినెల 22వ తారీకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న గాని ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురుస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు, 27వ నిరసన కార్యక్రమం సందర్భంగా కలికోట సూరమ్మ చెరువు వద్ద కాంగ్రెస్ బయట ఇంచి నిరసన వ్యక్తం చేసింది, 2018 లో శంకుస్థాపన చేసి ఓట్లు దన్నుకొని ఇప్పటికీ తట్టేడు మట్టి కూడా తీయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు, మళ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ప్రజలు నమ్మడానికి ఎటువంటి కొత్త నాటకాలు ఆడుతాడు చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు, వచ్చే ఎలక్షన్లలో కథలాపూర్ మేడిపల్లి ప్రజలు తరిమి తరిమి కొడతారని అన్నారు. ప్రతినెల ఎమ్మార్వో ఎంపీడీవో కలెక్టర్ ఆర్డిఓ వినతి పత్రాలు ఇచ్చిన కానీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఇది సిగ్గుచేటు అని అన్నారు. ఈ ఎలక్షన్ లో నైనా ప్రభుత్వం కల్పించుకొని కూడి ఎడమకాలువలు పూర్తి చేయాలని తెలిపారు, కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అజీమ్, మేడిపల్లి మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ప్ సిసి కార్యవర్గ సభ్యులు తొట్ల అంజయ్య, ఎంపిటిసి పులి శిరీష హరిప్రసాద్, రాష్ట్ర ఫిషర్మెంట్ కార్యదర్శి కల్లెడ గంగాధర్, కాంగ్రెస్ మండల నాయకుడు కృష్ణమాచారి,ఉప సర్పంచ్ మార్గం రాజేష్ ఆకుల వినోద్ అర్జున్ గౌడ్ గోవింద నాయక్ మహేందర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు