Thursday, 5 November 2026

పరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి

అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి హుజూర్ నగర్ నవంబర్ 22 (జనంసాక్షి): అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని,  సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారం నమ్మవద్దని హుజూర్ నగర్ సిఐ రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ లో బాలల హక్కుల వారోత్సవాల-చైల్డ్ లైన్ సే దోస్తీ”  సందర్భంగా  బాల రక్ష భవన్  సూర్యపేట వారి ద్వారా ”   హుజూర్ నగర్ లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ రామలింగారెడ్డి, ఎస్సై వెంకట్ రెడ్డి చేతుల మీదుగా “బాల్య వివాహాలు”, “ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు” సంబంధించిన అవగాహన గోడ పత్రికను విడుదల చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ  బాల్య వివాహాలు చేసినట్లయితే ఈ బాల్య వివాహాలకు పాల్పడిన బంధువులు, అందరిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీస్ సూపర్వైజర్ హేమలత, బాల రక్ష భవన్ సిబ్బంది సంరక్షణ అధికారి షేక్ నాగుల్ మీరా, సాయి త్రిలోక్, చైల్డ్ లైన్ మెంబర్ సఫియా తదితరులు పాల్గొన్నారు.