Tuesday, 3 November 2026

3 నెలల్లో 51 వేల బంగారు తల్లులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): బంగారు తల్లి పథకం కింద 51 వేల బంగారు తల్లుఉ నమోదయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రారంభించిన ఈ పథకంకు మంచి స్పందన లభించిందని, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మ్తంరి సునీతా లక్ష్మణ్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద మూడు నెలల్లో 51,929 మంది ఆడపిల్లల పేర్లు నమోదయ్యాయని వెల్లడించారు. ఇవాళ సచివాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకంపై సమీక్ష నిర్వహించి అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బంగారు తల్లి పథకం అమలుకోసం ఇప్పటి వరకు రూ. 57.5 కోట్ల నిధులు విడుదల చేశామని తెలిపారు. కాగా వచ్చే రచ్చబండ కార్యక్రమంలో సుమారు ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *