Friday, 6 November 2026

30% పిఆర్సి వర్తింప చేయాలి

30% పిఆర్సి వర్తింప చేయాలి.

రిలే దీక్షలకు సంఘీభావం తెలిపిన వెడ్మ బోజ్జు పటేల్.

జనం సాక్షి ఉట్నూర్.

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ 4 వతరగతి దినసరి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని టిపిసిసి సభ్యులు ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు వేడ్మ బోజ్జు పటేల్ ఆరోపించారు. సోమవారం ఉట్నూర్ ఐటిడిఎ కార్యాలయం ఎదుట ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షకు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా వెడ్మా భోజ్జు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండింస్తు రాజ్యాంగ బద్దంగా రావాల్సిన వాటాను ఉద్యోగులకు రాకుండా కుట్ర పన్నుతోందని అన్నారు. ఉద్యోగులు 8రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయమన్నారు.దినసరి ఉద్యోగులను రెగ్యులర్ చేసి అర్హత లేని వారికి టైం స్కేల్ ఇవ్వాలి 30శాతం పిఅర్సి వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొల్లపల్లి నర్సయ్య లాజర్ ఖయ్యాం భాయ్ దేవానందం ఇమ్రాన్ పరమేశ్వర్ రావ్ జైవంత్ ప్రేమ్ సలీం నగేష్ ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.