సాంస్కృతిక సారథి ఛైర్మెన్ రసమయి పై దాడిని కండిస్తున్నాము
౼౼సాంస్కృతిక సారథి సంగారెడ్డి జిల్లా కళాకారులు౼౼
సంగారెడ్డి నవంబర్ 14 (జనం సాక్షి)
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్ల్యే రసమయి బాలకిషన్ పై గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో కొందరు దుండగులు చేసిన దాడిని సంగారెడ్డి జిల్లా సాంస్కృతిక సారథి కళాకారులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సాధనలో తన పాట మాట ప్రజలందరిని కదిలించింది. రసమయి పర్యటన సమాచారం తెలుసుకుని పిరికిపందెల్లాగా, ప్రణాళిక వేసుకుని దాడి చేయడం దుర్మార్గం. రసమయి బాలకిషన్ గారు ఎమ్మెల్లే గా, సాంస్కృతిక సారథి ఛైర్మెన్ గా ఎంతో ఉన్నత విలువలతో పాలన కొనసాగిస్తున్నారు. దళిత ఎమ్మెల్యే కాబట్టి ఏమైనా చేస్తాం అనే మీ కుటిలబుద్ది కి బవిషత్ లో ప్రజలే బుద్ధి చెబుతారని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ పట్టణంలోని ఐ.బి గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారథి సంగారెడ్డి జిల్లా టీమ్ లీడర్ ఆయిదాల సునీల్ కళాకారులు నీరుడి దుర్గేష్, డప్పు రమేష్, సంబరబోయిన మల్లేష్, మ్యాక రాజు, బామిని నవీన్, ఏర్పుల వినేశ్, నరిగె స్వప్న మరియు పటేల్ సంధ్య లు పాల్గొన్నారు




