ఖైరతాబాద్: శారీరక వికలాంగులైన విద్యార్థుల్లో మానసిక స్థ్యైర్యాన్ని పెంపొందించేందుకు ది ఫోర్త్ ఎస్టెట్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన 5కె రన్ ఉత్సాహంగా సాగింది. ఆదివారం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఈ రన్‌ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మంచి పని కోసం నిర్వహించిన ఈ రన్‌లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజేతలకు మెడల్స్‌తోపాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ అంగవైకల్యం ఉన్న ఎంతో మంది విద్యార్థులు విద్యా, ఉపాధి పరంగా ముందుకు వెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిలో మానసిక వికాసం, ఆత్మస్థ్యైరాన్ని పెంచెందుకు ది ఫోర్త్ ఎస్టెట్ సంస్థ ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత నారాయణ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో సేవా భావంతో పనిచేసే ఫోర్త్ ఎస్టెట్ లాంటి సంస్థలను ప్రొత్సహించాలన్నారు. మొదటి బహుమతిని గులాం ఫైసల్, సెకెండ్ బహుమతిని మోతే శ్యామ్ గెలుచుకున్నారు. కార్యక్రమంలో నిర్వాహక సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ బాబు, డైరక్టర్లు మహ్మాద్ రఫీ, సాయన్న, ప్రతినిధులు ప్రదీప్, విజయ్, హరీశ్, పవన్ పాల్గొన్నా
నెక్లెస్ రోడ్‌లో 5కె రన్




