టేకులపల్లి, మే 20( జనం సాక్షి ): టేకులపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వివోఏ ల నిరవధిక సమ్మె చేపట్టి శనివారానికి 34 రోజులుకు చేరుకుంది. ఈ క్రమంలో బీఎస్పీ ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి బాదావత్ ప్రతాప్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం సమ్మె చేస్తున్న శిబిరానికి చేరుకొని వారు కొనసాగిస్తున్న సమ్మెకు న్యాయపరమైనదిగా భావిస్తూ మద్దతు పలుకుతూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బాదావత్ ప్రతాప్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు నుండి వివో ఏలు గ్రామాలలో రాత్రి, పగలులో మహిళల సంఘాలను కూడగట్టుకొని సమావేశాలు పెట్టి, సంఘాలు ఏర్పాటు చేసి, పొదుపు కట్టించి, లోన్లు ఇప్పించి, బ్యాంకులోను శ్రీనిధి లోను గ్రామ సంఘం నుండి లోన్లు ఇలా అనేక రకాల ప్రభుత్వం నుండి సర్వేలు ప్రభుత్వం పథకాలన్నీ కూడా గ్రామాలలో మహిళలకు చేర్చడంలో అహర్నిశలు కృషి చేస్తూ కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు . వారి ఆర్థిక,సామాజిక అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. వారికి కనీసం వేత్తనం 26వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సి ఈ ఆర్ పి ఉద్యోగాలుగా గుర్తించాలని డిమాండ్ చేయడంలో ఎంతో న్యాయం ఉందని అన్నారు. వారి 9 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, లేనియెడల రాష్ట్రమంతటా ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రగతి భవానాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. వారివి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారు తలుచుకుంటే ప్రభుత్వాన్ని గద్దె దింపే సామర్థ్యం వారికి గ్రామాలలో ఉంటాయన్నారు. వారిని తక్కువ అంచన వేయకూడదన్నారు. వారి పక్షాన బీఎస్పీ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లేతాకుల కాంతారావు, ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు తచ్చడి సత్యనా
34వ రోజు కొనసాగుతున్న వివోఎ ల సమ్మె – సంఘీభావం తెలిపిన బీఎస్పీ ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జ్ బాదావత్ ప్రతాప్ నాయక్




