మంచిర్యాల జనంసాక్షి : భారతదేశ మహిళా క్రీడాకారులు రేజ్లర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడు బీజేపీ,ఎంపీ బ్రిజ్ భూషణ్ ను ఆరెస్ట్ చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ కి మెమోరండం ఇచ్చిన సందర్భంగా రేగుంట చేంద్రకళ జిల్లా కార్యదర్శి భారత జాతీయ మహిళా సమాఖ్య, మాట్లాడుతూ దేశంలో అత్లేట్స్ రంగంలో అనేక పథకాలు దేశానికి సాధించిపెట్టి దేశానికి క్రీడా రంగంలో సేవలు అందిస్తున్న మహిళలకే ఈ భారతావనిలో అవమానం జరిగే దుశ్చర్యకు పాల్పడిన రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ అరెస్టు చేయకపోవడం బిజెపి నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనం. దేశంలో అగ్రభాగాన నిలిచే మహిళ క్రీడాకారులకు రక్షణ ఇవ్వలేని ఈ కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న సాధారణ మహిళలకు ఎలాంటి రక్షణ ఇస్తుందో అర్థమవుతోంది. మహిళా సాధికారిత, భేటీ బచావో , భేటీ పడావో ఇలాంటి అందమైన మాటలు చెప్పడం తప్ప నరేంద్ర మోడీ మహిళలకు ఇచ్చే గౌరవం రెజ్లార్లతో అర్థమవుతుంది వెంటనే బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలని భారత జాతీయ మహిళా సమైక్య బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు
జెంజర్ల ఉమ,
అచ్చే విజయ,
అచ్చే మంజుల,
బాకం విజయ లు పాల్గొన్నారు.
బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలి…. రేగుంట చేంద్రకళ జిల్లా కార్యదర్శి భారత జాతీయ మహిళా సమాఖ్య




