జైరాం:తెలంగాణ రాష్ట్రంలో 4వేల
మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కృషి..
హైదరాబాద్: ఐదారేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కృషి చేయనున్నట్లు కేంద్రమంత్రి జైరాం రమేష్ తెలిపారు. మహబుబ్‌నగర్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెరాస ఏర్పాటుకు ముందే కాంగ్రెస్ తెలంగాణ ప్రకటన చేసిందని గుర్త చేశారు. 2000 సెప్టెంబరు 21న మహబుబ్‌నగర్‌లో తెలంగాణ ప్రకటన చేసినట్లు వివరించారు. తెలంగాణకు మద్దతుగా లేఖ ఇచ్చిన తెదేపా మాట మార్చిందన్నారు. వెనుకబడిన జిల్లా కారణంగా మహబుబ్‌నగర్ పదేళ్లు పన్నురాయితీ వస్తుందని జైరాం రమేష్ వివరించారు.




