స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు
శారదానదిలో మృతి చెందారు
అనకాపల్లి పట్టణం: శారదనదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన విశాఖ జిల్లా తుమ్మలపాలెం సమీపంలో చోటు చేస్తుకుంది. విశాఖపట్నం ఎన్‌ఏడీ ప్రాంతానికి చెందిన కేఈ అమరనాథ్ (19), తాళపురెడ్డి పృధ్వీరాజ్ (19), పురుషోత్తపురానికి చెందిన పప్పు మురళి (19)తో పాటు 12 మంది శారదనదిలో స్నానానికి వెళ్లారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఐదుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వీరిలో ఇద్దరిని ప్రాణాలతో రక్షించగా అమరనాథ్, పృథ్వీరాజ్, మురళి మృతి చెందారు. అమరనాథ్ విజయనగరంలోని మహారాజ ఇంజినీరింగ్ కళాశాలలో, పృధ్వీరాజ్ కూడా విజయనగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. అనకాపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




