Tuesday, 3 November 2026

4 రోజుల్లో 195 బస్సులు సీజ్‌

హైదరాబాద్‌ : ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దగ్దమై 45మంది ప్రయాణికులు సజీవ దహనమైన సంఘటనతో కళ్లుతెరిచిన రవాణా శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ తనిఖీ చేసే కార్యక్రమం ముమ్మరం చేశారు. ఆదివారం ఒక్క రోజే 42 బస్సులను సీజ్‌ చేశారు. ఇంకా ప్రైవేట్‌ బస్సులపై దాడులు కొనసాగుతాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్‌ బస్సుల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *