హైదరాబాద్,(జనంసాక్షి): నేటి నుంచి వచ్చే నెల 4 వరకు హైదరాబాద్‌లో నిషేదాజ్ఞలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధిస్తున్నట్లు సీపీ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం బీఆర్‌కే భవనం, మత్య్స శాఖ కమిషనర్ భవనం. మింట్ కంపౌండ్, నిజాం కళాశాల, అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్, ట్యాంక్‌బండ్ వద్ద ఆంక్షలు విధించినట్లు సీపీ తెలిపారు.




