5 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: ఆత్మకూరు, చిన్నచింతకుంట మండలాల సరిహద్దు వూకచెట్టువాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించే ముఠాలపై దాడులు నిర్వహించారు. వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 5 ట్రాక్టర్లను పట్టుకున్నారు. ట్రాక్టర్‌ యజమానులపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.