Tuesday, 3 November 2026

నిప్పులు చిమ్ముతూ ..నింగికెగిరిన జీఎన్‌ఎల్‌ వీ డి-5

హైదరాబాద్‌ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ఎంతో కీలకమైన జియోసింక్రనన్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ-డీ5) నింగిలోకి విజయవంతంగా దూసుకుపోయింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో శనివారం ఉదయం 11.18 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. 29 గంటల పాటు ఈ కౌంట్‌డౌన్‌ ప్రకియ సాగింది. ఈ వాహననౌక 1980 కిలోల బరువున్న సమాచారం ఉపగ్రహం జీశాట్‌ -14ను మోసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహం ఖర్చు రూ. 45కోట్లు ప్రయోగం కోసం చేస్తున్న మొత్తం ఖర్చు రూ. 205కోట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *