హైదరాబాద్: కలుషిత ఆహారం తిని అనంతపురం జిల్లాలో 500 గొర్రెలు మృతి చెందాయి. నగర శివారులోని పారిశ్రామిక వాడ ప్రాంతంలో బొరుగుల్ని గుర్తు తెలియని వ్యక్తులు పారవేయగా మేత కోసం వచ్చిన గొర్రెలు వాటిని తినడంతో అవి అక్కడికక్కడే చనిపోయాయి. మరికొన్ని గొర్రెల పరిస్థితి విషమంగా ఉండడంతో పశు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బొరుగులు పాడై విషపదార్ఘంగా మారడం వల్లే గొర్రెలు మరణఙంచినట్లు వాటి యజమానులు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పాడిపరిశ్రమశాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. చనిపోయిన గొర్రెల విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుందని యజమానులు చెప్పారు.




